ఒక్క భారత దేశమే కాదు... యావత్ క్రీడాలోకం వేయికళ్లతో ఎదురుచూసింది. క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను భారత రత్న వరిస్తుందా లేదా అని. కానీ మన ప్రభుత్వం ఈసారి కూడా ఎందుకనో వెనుకంజవేసింది. ఈనాడు, ఒక్క క్రీడాప్రపంచమే కాదు- రాజకీయ, సామాజికవర్గాలే కాదు అందరూ కూడా సచిన్‌కు భారత రత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. అందరి ఉత్సాహం నీరుగారిపోయింది. అసలు మన పాలకుల అంతర్యం ఏమిటో ఒక్క పట్టాన అర్థం కాలేదు. ఎందుకు ఇవ్వలేదో వారికే తెలియాలి. సచిన్ వయసు చూసి, అపుడే ఏం తొందర అని అనుకుంటున్నారా? లేకపోతే మరేమిటి! అతని ప్రతిభను చూసి సత్కరించండి. గత 21 సంవత్సరాలుగా క్రికెట్ రంగంలో అతని రికార్డులు చూడండి. ఒక్క ఆటలోనే కాదు... భారత క్రీడారంగానికి అతను నిలువెత్తు ఆదర్శం. అతని పేరు చెబితేనే ప్రతి క్రీడాకారుడు గర్వంతో తలపైకి ఎత్తుతాడు. అతని సేవానిరతి, సామాజిక బాధ్యత కూడా చూడండి.. ఎవ్వరికి తీసిపోని దయాగుణం సచిన్ టెండూల్కర్‌ది... కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా... మాకు మాత్రం సచిన్ ఎప్పటికీ భారత రత్నే...
Tuesday, January 25, 2011
SACHIN- BHARAT RATNA

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment