ఏదైతే జరగవద్దని... ఇన్నాళ్లుగా అనుకున్నానో... అదే జరిగింది. తెలంగాణ వాదిగా- ఉద్యమం శాంతియుతంగా జరగాలిని, సీమాంధ్ర సోదరుల అంగీకారం, సహకారంతోనే విడిపోవాలని కోరుకున్న వాళ్లలో నేనూ ఒక న్ని. కానీ... అసెంబ్లీ సాక్షిగా- కాంగ్రెస్ కుటిల రాజకీయాల సాక్షిగా దురద్రుష్టకరమైన సంఘటన జరిగే పోయింది. తెలంగాణ వాదాన్ని ఎప్పుడూ కించపరిచే మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి- తాజా రాజకీయాలు అంటే పూర్తిగా అవగాహన లేని జేపీపై దాడి జరిగింది. ఓ ప్రజాస్వామ్యవాదిగా, ఓ శాంతికాముకుడిగా నేను ఆ దాడిని ఖండిస్తాను. కానీ జేపీ చేసిందేమిటి? అప్పటికే- అసెంబ్లీ లోపల మార్షల్స్‌చే గెంటివేయబడిన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు ఎదురుగా ఉన్నప్పటికీ- లెక్కచేయకుండా, మీడియా ముందు అనవసర విషయాలను ప్రస్తావించడంతో- TRS శాసనసభ్యులు తమను తాము నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఆ దాడి.
అయితే- శాసనసభలో ఎన్నో పార్టీలున్నాయి. ఎందరో సీనియర్ శాసనసభ్యులున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలున్నాయి. కానీ ఎవ్వరికీ లేని అభ్యంతరాలు కేవలం జేపీకే ఉండటం కూడా అర్థంకానిది. అంతా వ్యూహాత్మకంగా పోతుంటే- లోకసత్తా నేత జయప్రకాశ్‌నారాయణ్ మాత్రం మీడియా పాయింట్ వద్ద ఇష్టానుసారంగా మాట్లాడి టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. దాని ఫలితమే ఈ దాడి.
జేపీ లాంటి నేతలు- కాంగ్రెస్ సభ్యులను చూసి చాలా నేర్చుకోవాలి. గవర్నర్ ప్రసంగం, టి.ఆర్.ఎస్, టీడీపీ వ్యూహాలకు జడిసి- ఢిల్లీలోనే దాచుకున్న కాంగ్రెస్ శాసనసభ్యులను చూసి జేపీ చాలా నేర్చుకోవాలి. ఎక్కడ తెలంగాణ వాదానికి మద్దతు ప్రకటించాల్సి వస్తుందన్న భయంతో కాంగ్రెస్ తెలంగాణ నేతలు- ఏపీ భవన్‌లోనే మకాం వేస్తే- ఇక్కడ జేపీ లాంటి వారు కాంగ్రెస్ చేతిలో పావుగా మారారు.
మీ అభిప్రాయాలను, మీ విశ్లేషణనను ఏ కోణంలో చూసినా నేను
ReplyDeleteపూర్తి అంగీకరించలేకపోతున్నాను. ఓ ప్రజాస్వామ్య వాదిగా దాడిని
ఖండించినందుకు మాత్రం అభినందిస్తున్నాను.