నిజంగానే- వారిద్దరు మహనీయులు. ఇద్దరూ వారి రచనలతో ప్రజలను రంజింపజేశారు. ఒకరు అనంత్ పాయ్, రెండోవారు ముళ్లపూడి. కొద్దిగంటల తేడాలో ఇద్దరూ మరణించడం చాలా ఆవేదనకు గురిచేసంది.
అంకుల్ పాయ్‌గా చిరపరిచితుడైన అనంత్- తన కామిక్స్‌తో ఓ విప్లవానికి నాంది పలికారు. ఆయన రచించిన అమర్‌చిత్రకథలు- అన్ని భాషల్లోకి అనువదించారు. తద్వారా పిల్లలకు మన ప్రాచీన, పౌరాణిక, ఆధ్యాత్మిక, చరిత్రాత్మక విశేషాలన్నీ తెలిశాయి. చక్కటి బొమ్మలతో, అర్థమయ్యే పదజాలంతో ఆయన రచనలు గొప్ప ఖ్యాతినార్జించాయి. దూరదర్శన్ ఏర్పాటు చేసిన ఓ క్విజ్ కార్యక్రమంలో పిల్లలకు భారత పురాణాల పట్ల ఎలాంటి అవగాహన లేదని తెలుసుకున్న ఆయన అమర్ చిత్ర కథలకు పూనుకోవడం చిన్నారులు చేసుకున్న భాగ్యం అనుకోవాలి. అలాగే టింకిల్ పేరిట పిల్లల కోసమే మరో కామిక్స్ సిరీస్‌ను ఆరంభించారు. ఈ రెండు దేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచాయి.
0 comments:
Post a Comment