ఇది పరీక్షల సమయం. నిజంగానే కేవలం విద్యార్థులకే కాదు- రాజకీయ నేతలకు, రాజకీయ పక్షాలకు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర -రాష్త్ర ప్రభుత్వాలకు కూడా. ఎందుకంటే- పిల్లలైతే చదువుకుంటారు. పరీక్షలు రాస్తారు. కానీ రాజకీయ నాయకులకు చదువులతో పనిలేదు. వారికి తెలిసిందల్లా రాజకీయాలు చేయడమే. అవకాశం దొరికితే- విద్యార్థుల్ని సైతం పావుగా వాడుకోవడమే. వారి భావోద్వేగాలకు వందల మంది విద్యార్థులు బలపీటమెక్కారు. కానీ రాజకీయ నేతలు మాత్రం కుటిలయత్నాలు మానడం లేదు. విశ్వాసం నెలకొల్పే చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే ఉంది.
ఇపుడు రాష్ట్ర ప్రజలను పదో తేదీ వణికిస్తోంది. ముఖ్యంగా రాజధానిలో నివసించే వారికి ఇది ఎక్కువగా ఉంది. ఆరోజు ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాలకిందట వలసవచ్చిన ఆంధ్ర సోదరులను ఈ పరిణామాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వారికేం జరగదని, వారిజోలికి వెళ్లమని రాజకీయ ఐకాస స్పష్టంగా ప్రకటించాలి. అపుడే మిలియన్ మార్చ్ అర్థమంతమవుతుంది.
ఇక విద్యార్థుల విషయానికొస్తే- అంతా అయోమయం, గందరగోళం. ప్రభుత్వం పట్టుదలకు పోతే- పరిస్థితి ఏంటి? పదో తేదీ సీనియర్ ఇంటర్ ఇంగ్లీష్ పరీక్ష ఉంది. అది రాయడానికి లక్షలాది మంది స్టూడెంట్స్ ఎదురుచూస్తున్నారు. పోలీస్ పహారాలో పరీక్షలు రాసే పరిస్థితి రాకూడదు. రెండు పక్షాలు పట్టువిడుపులకు సిద్ధంగా ఉండాలి. పిల్లలకు ఇంటర్ పరీక్షలు ఎంతో కీలకం. వారి లైఫ్‌లో ఈ పరీక్షలు టర్నింగ్‌పాయింట్. వారిని ధైర్యంగా పరీక్షలు రాయనిద్దాం.
భవిష్యత్ తెలంగాణ వారికోసమే అన్నప్పడు, భవిష్యత్ విద్యార్థులకు ఏం నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడదాం. ప్రభుత్వం కూడా పంతానికి పోకుండా పదో తేదీన పరీక్షను వాయిదా వేస్తే- పిల్లలు, వారి తల్లిదండ్రులు కాస్త ఊపిరిపీల్చుకుంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర సర్కార్, కాంగ్రెస్ హైకమాండ్‌లు సూచనప్రాయంగా చెబుతున్నాయ్ కాబట్టి- హైదరాబాద్‌లో జరగబోయే పరీక్షల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి.
always Exams are an headache for students..
ReplyDeleteBut Keen work and Right planning would overcome that headache.
All the best Guys & Gals :)
Regards:
Blogger Sampath
www.GamingGarage.tk