Monday, January 31, 2011

ఎవరిని నమ్మాలి...నిజమే... తెలంగాణ విషయంలో ఎవ రిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే- ఆ ప్రాంతంలోని ప్రతి పార్టీ తెలంగాణ అంశం గురించి మాట్లాడుతోంది. దాన్ని ఏర్పాటును సమర్థిస్తోంది. ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు కోసమే తెరపైకి వచ్చిన TRS పార్టీ ఇపుడు మరింత దూకుడుగా వెళ్తోంది. పనిలోపనిగా పార్టీ పునాదులను బలోపేతం చేసుకుంటోంది. అందుకే ఇతర పార్టీల దిగువస్థాయి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు గెలవడం కోసం KCR పక్కా ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు- అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతోపాటు... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఈ విషయంలో తెలంగాణవాదులను తికమకపెడుతున్నాయి. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ- సమస్యను జటిలం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో మంత్రులు, ఎంపీలు ఎవరికివారే పోటీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. పాపం... ప్రజలు ఇది గమనిస్తున్నారని వారికి తెలయదనుకుంటా.

ఇక వామపక్షలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. రెండు పార్టీలది చెరోదారి.  మజ్లిస్‌ పార్టీలో ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సపోర్ట్‌ చేస్తే ఏం లాభం... చేయకపోతే ఏం నష్టమో తేల్చుకోలేని పరిస్థితిలో MIM నేతలున్నారు. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ- ప్రాంతీయత త్వాన్ని సొమ్ముచేసుకోవాలని ఆశపడుతోంది. లోకసత్తా అసలు పార్టే కాదు...

పాపం... చిరంజీవికి సరైన మార్గదర్శకత్వమే కరవైంది. ఎట్లాగూ పార్టీ పోయింది... ఇపుడు సినిమాలూ పోతున్నాయ్‌... అందుకేనేమో... అధికార పార్టీకి అనుకూలంగా మసులుతున్నారు. మేడమ్‌ను కలుస్తున్నారు. పీఎం కూడా అపాయింట్‌మెంట్‌ ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా చిరు సంకటస్థితిని వాడుకుంటోంది.  జగన్మోహన్‌రెడ్డి  నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ద్రుష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది అని చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది.

Tuesday, January 25, 2011

SACHIN- BHARAT RATNA
ఒక్క భారత దేశమే కాదు... యావత్‌ క్రీడాలోకం వేయికళ్లతో ఎదురుచూసింది. క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను భారత రత్న వరిస్తుందా లేదా అని. కానీ మన ప్రభుత్వం ఈసారి కూడా ఎందుకనో వెనుకంజవేసింది. ఈనాడు, ఒక్క క్రీడాప్రపంచమే కాదు- రాజకీయ, సామాజికవర్గాలే కాదు అందరూ కూడా సచిన్‌కు భారత రత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. అందరి ఉత్సాహం నీరుగారిపోయింది. అసలు మన పాలకుల అంతర్యం ఏమిటో ఒక్క పట్టాన అర్థం కాలేదు. ఎందుకు ఇవ్వలేదో వారికే తెలియాలి. సచిన్‌ వయసు చూసి, అపుడే ఏం తొందర అని అనుకుంటున్నారా? లేకపోతే మరేమిటి! అతని ప్రతిభను చూసి సత్కరించండి. గత 21 సంవత్సరాలుగా క్రికెట్‌ రంగంలో అతని రికార్డులు చూడండి. ఒక్క ఆటలోనే కాదు... భారత క్రీడారంగానికి అతను నిలువెత్తు ఆదర్శం. అతని పేరు చెబితేనే ప్రతి క్రీడాకారుడు గర్వంతో తలపైకి ఎత్తుతాడు. అతని సేవానిరతి, సామాజిక బాధ్యత కూడా చూడండి.. ఎవ్వరికి తీసిపోని దయాగుణం సచిన్‌ టెండూల్కర్‌ది... కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా... మాకు మాత్రం సచిన్‌ ఎప్పటికీ భారత రత్నే...

Sunday, January 23, 2011

BLACK MONEYఎవడబ్బ సొమ్ము...
నల్లధనం... నల్లధనం... ఇపుడు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట! ఎవ్వర్ని కదిపినా... దీని గురించిన చర్చలే వినిపిస్తాయి. అంతలా మన రాజకీయ రాబందులు దేశాన్ని దోచుకున్నాయి. కాదు కాదు... బడుగు బలహీనవర్గాల పొట్టగొట్టి ప్రజాధనాన్ని సరిహద్దులు దాటించాయి. దీని గురించి రాజకీయ పక్షాలు పెద్దగా మాట్లాడవు. ఎందుకంటే- అందరూ ఒక్కతాను ముక్కలే కదా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్విస్‌ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారో... గంగలో దూకుతారో తెలియదు కానీ... మన డబ్బు మనకు చెందాలి. ఎవరో అన్నారు. స్వాతంత్య్రం రాకమునుపే ఈ నల్లధనం విదేశాలకు వెళ్లడం ఆరంభమయిందట. ఉండవచ్చు.

దేశంలోని బడాబాబులు ఎవరైతే ఉన్నారో... వారంతా దొరికింది దొరికినట్టు దోచుకున్నారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. వారికి శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు అండదండగా ఉండటంతో- ఆడిందే ఆట... పాడిందే పాట అయ్యింది. 20 లక్షల కోట్లు కాదు... దానికి ఎన్నో రేట్ల నల్లధనం దేశం దాటివెళ్లిపోయింది. సుప్రీంకోర్టు చురకలు వేసినా... కేంద్రంలో ఉలుకు పలుకు లేదు. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు, పేర్లు బయటపెట్టడం సాధ్యం కాదని స్వయంగా ప్రధాని ప్రకటించడం సిగ్గుచేటు కాక మరేమిటి?

Saturday, January 8, 2011

Thirsty Sachin

సచిన్ బాగా ఆడుతున్నాడు. అతని కెరీర్లోనే ఇది అద్బుతమైన సమయం. గత ఏడాదిగా అతను చాల నిలకడగా ఆడుతున్నాడు. సెంచురిల మీద సెంచురీలు కొడుతున్నాడు. ఎన్ని చేసినా ఇంకా సంతృప్తి లేదంటున్నాడు. హాపీగా ఉన్నా సంతృప్తిగా లేదంటున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో సచిన్ 883 పాయింట్లతో ఉమ్మడిగా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు.

సఫారి టూర్లో మాస్టర్ ఇరగదీసాడు. రెండు శతకాలతో తన సత్తా ఏమిటో చాటిచెప్పాడు. ముఖ్యంగా యాబ్బయ్యో సెంచురీ చాల స్పెషల్. ఈ ఏడాది ఫెబ్రవరిలో జరిగే వరల్డ్ కప్లో ట్రోఫి గెలవాలని సచిన్ టార్గెట్.

అతని కోరిక తీరాలని మనమూ కోరుకుందాం... ఆల్ ది బెస్ట్ సచిన్.