నేల తల్లి తన ఇద్దరు ముద్దు బిడ్డలను తనలో విలీనం చేసుకుంది. ఒకరు మానవ హక్కుల కోసం గళం ఎత్తితే, మరొకరు రైతన్న కోసం నినదించారు. ఆ ఇద్దరు మహానుభావులను 24 గంటల తేడాలో మనల్ని శాశ్వతంగా
వదిలి వె ళ్లడం నన్ను తీవ్రంగా కలచి వేసింది.
మన తెలుగుబిడ్డ కాకతీయ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బుర్రా రాములు- ఎక్కడ హక్కులు భంగపడితే అక్కడ వాలేవారు. బడుగు వారి పక్షాన పోరాడేవారు. ట్రేడ్ యూనియన్లలోనూ, పౌరహక్కుల సంఘంలోనూ, తర్వాత మానవహక్కుల వేదికలోనూ ఆయన చేసిన సేవలు ఈ తరం వారికి ఆదర్శప్రాయం.
ఇక మహేంద్రసింగ్ తికాయత్ గురించి మన తెలుగువారికి చాలా తక్కువ తెలుసు. ఆయన అవిశ్రాంత రైతు పోరాట యోధుడు. ఉత్తర భారతంలో రైతాంగానికి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారు. భారతీయ కిసాన్ యూనియన్ పక్షాన తికాయత్ చేసిన పోరాటం కారణంగా అన్నదాతకు ఎంతో మేలు జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన ఆయన చెరుకుకు మద్దతు ధర కల్పించాలని, భారమైన రుణాల మాఫీ కోసం, విద్యుత్ ఛార్జీల తగ్గింపు కోసం మహాధర్నాలు నిర్వహించి, కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఈ ఇద్దరు జన నేతలకు నా శ్రద్ధాంజలి...